RC17 హీరోయిన్ ఫిక్స్

RC17 Heroine FinalizedRC17 Heroine Finalized

 

గ్లోబల్ స్టార్ స్టార్ రామ్ చరణ్-క్రేజీ పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కాంబోలో దసరా అంటే విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో మొదలు కాబోయే RC17 ప్రాజెక్ట్ పై ట్రేడ్ లో ఇప్పటికే బోలెడన్ని అంచనాలు మొదలైపోయాయి. ఎప్పుడో మొదలు కావాల్సిన ఈప్రాజెక్టు రామ్ చరణ్ మణికట్టు సర్జరీ తో వాయిదా పడింది.

ప్రస్తుతం సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటుగా ఈ చిత్రంలో నటించబోయే కీలక నటుల ఎంపిక చేపట్టారు. అందులో భాగంగా రామ్ చరణ్ కి జోడి ని కూడా సుక్కు సెట్ చేసేసారట. RC17 లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ సారా అర్జున్ ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది.

ఈ విషయాన్ని పూజ కార్యక్రమాలు రోజునే రివీల్ చేస్తారట. ధురంధర్ తో విపరీతంగా పాపులర్ అయిన సారా అర్జున్ RC17 లో హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లుగా టాక్. పెద్దిలో జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేసిన చరణ్, RC17 లో సారా అర్జున్ తో జోడి కట్టబోతున్నారు.

Sara Arjun Confirmed for Ram Charan's RC17