బాక్సాఫీసు పై దృశ్యం 3 దండయాత్ర
Drishyam 3 Storms the Box Office
హిందీలో గత వారం విడుదలైన అజయ్ దేవగన్ దృశ్యం 3 ది కంక్లూజన్ చిత్రం బాక్సాఫీసు పై దండయాత్ర చేస్తుంది. సినిమా విడుదలకు ముందే పాజిటివ్ బజ్ తో భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన దృశ్యం 3 చిత్రం విడుదలయ్యాక బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీసు దగ్గర జాతరను తలపించేస్తుంది.
కేవలం 10 రోజుల్లో రూ.500 కోట్లు గ్రాస్ కి దగ్గరైంది. దృశ్యం 3 విధ్వంశం ఇంకా తగ్గలేదు. ఇప్పుడు దసరా హాలిడేస్ దృశ్యం 3 కి అడ్వాంటేజ్ గా మారాయి. ఇండియాలో 286.5 కోట్ల నెట్, 343 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. నిన్న శని, ఆదివారాల్లోనూ దృశ్యం 3 వసూళ్లు అదిరిపోయాయి.
మొదటి వారమే కాదు, సెకండ్ వారంలోను దృశ్యం 3 అల్లాడిస్తుంది. అసలు ఒక రీమేక్ ఈ విధమైన వసూళ్లు తీసుకొస్తుంది అని ఎవరూ గెస్ చెయ్యలేదు, అయితే దర్శకుడు రీమేక్ ని రీమేక్ లా చాలా అంటే చాలా కొత్తగా చూపించడమే నార్త్ ఆడియన్స్ కి దృశ్యం 3 కనెక్ట్ అవడానికి కారణమైంది. మరి దృశ్యం 3 ఫైనల్ కలెక్షన్స్ రిపోర్ట్ ఎంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి.















































