బాలయ్య నిజంగా గ్రేట్
Balakrishna donates house for road expansion
నందమూరి బాలకృష్ణ ముక్కుసూటి మనిషి. ఏదున్నా మొహం మీద చెప్పే మనిషి. తాజాగా బాలకృష్ణ తన ఇంటిని రోడ్ వైడ్ కోసం తన ఇంటికి సంబందించిన సగం స్థలం నష్ట పరిహారం ఇచ్చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రహదారుల విస్తరణ పనులకు నందమూరి బాలకృష్ణ తన స్వగృహంలోని దాదాపు 862.77 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు.
దాని కోసం నగదు రూపంలో ఎలాంటి నష్టపరిహారం తీసుకోవడం లేదు. కేబీఆర్ పార్క్ చుట్టూ వేస్తున్న రోడ్ అలాగే ఫ్లైఓవర్ల వల్ల కొంతమంది ప్రముఖులు తమ ఆస్తులు పోతాయనే నెపంతో అభివృద్ధి ప్రాజెక్టులను, ఫ్లైఓవర్ పనులను అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.
కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం సంకోచించకుండా తన నివాస స్థలాన్ని ఎలాంటి నష్టపరిహారం తీసుకోకుండా త్యాగం చేశారు. ఈ ఇంటిని బాలకృష్ణ కోసం ఎన్టీఆర్ 1982లో నియమించారు. అదే ఇంట్లోనే ఎన్టీఆర్ ఎన్నో కీలక సమావేశాలు నిర్వహించారు.















































