ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10 : Wild Cards tagated Shalini and Charan

BB10: వైల్డ్ కార్డ్స్ అందరికి షాలిని, చరణే టార్గెట్

Bigg Boss 10 : Wild Cards tagated Shalini and CharanBigg Boss 10 : Wild Cards tagated Shalini and Charan


బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఐదు వారాల తర్వాత ఆరుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు. అందులో సీరియల్ నటుడు శివ, శ్వేతా నాయుడు, నటరాజ్ మాస్టర్ వైఫ్, RGV హీరోయిన్ దక్షి గుత్తికొండ, అగ్నిపరీక్ష రామకృష్ణ లు ఈరోజు దసరా స్పెషల్ ఎపిసోడ్ లో హౌస్ లోకి రాబోతున్నారు.

అయితే వైల్డ్ కార్డు లను స్టేజ్ పైనే హౌస్ లో ఉన్న ఎవరి ఆట మీకు నచ్చలేదు అనగానే చాలామంది షాలిని పై వేటు వేశారు, ఆమె ఆట కనిపించడం లేదు, షాలిని బిగ్ బాస్ కప్ గెలవాలని వచ్చిందా, లేదంటే రోహిత్ ని ఇంప్రెస్స్ చెయ్యడానికి వచ్చిందా అని నీతూ మాస్టర్ అడగగానే.. షాలిని కూడా అంతే పొగరుగా మీరు హౌస్ లోకి వస్తారుగా చూసుకుందాం అంది.

అగ్నిపరీక్ష రామకృష్ణ రోహిత్ ఇంకా షాలిని ని టార్గెట్ చేసి మాట్లాడాడు, ఇక షాలిని తర్వాత వైల్డ్ కార్డ్స్ మొత్తం చరణ్ ని టార్గెట్ చేసారు. చరణ్ కి సెకండ్ ఛాన్స్ వచ్చినా యూస్ చేసుకోలేదు అంటూ అతన్ని టార్గెట్ చెయ్యడమే కాదు.. వైల్డ్ కార్డ్ చేతిలో ఉన్న పవర్ సాయంతో షాలిని ని సేవ్ చేసి చరణ్ ని ఎలిమినేట్ చేసినట్లుగా తెలుస్తుంది. 

Bigg Boss Telugu 10: Six wildcard entrants to shake up