ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kiara and Siddharth to become parents again

మళ్లీ గుడ్ న్యూస్ చెప్పిన సెలెబ్రిటీ జంట

Kiara and Siddharth to become parents againKiara and Siddharth to become parents again


బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కెరీర్ లో ఎంత పీక్స్ లో ఉన్నా బ్యాక్ టు బ్యాక్ పిల్లలను కనెయ్యడానికి సిద్దమైపోతున్నారు. దీపికా పదుకొనే ఒక పాప కు జన్మనిచ్చిన రెండేళ్లకు మరోపాపకు జన్మనిచ్చింది. ఇప్పుడు మరో సెలెబ్రిటీ జంట రెండోసారి తల్లతండ్రులుగా మారబోతున్నట్టుగా అభిమానులతో గుడ్ న్యూస్ పంచుకున్నారు.

వారే బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు. ఈ సెలబ్రిటీ జంట మరోసారి పేరెంట్స్ గా మారబోతున్నట్టుగా అనౌన్స్ చేసారు. గత ఏడాది పాప కు జన్మనిచ్చిన ఈ జంట చాలా ఫాస్ట్ గా రెండో సంతానానికి జన్మనివ్వనున్నట్లుగా గుడ్ న్యూస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.

మొదటి కూతురు సారాయా చేతితో పాటు తెల్లటి చిన్న బేబీ డ్రెస్సును అరచేతుల్లో ఉంచి న పిక్ ని ఎమోషనల్ గా షేర్ చేస్తూ.. మరోసారి జీవితంలో అత్యంత గొప్ప బహుమతిని అందుకోబోతున్నాం.. మా హృదయాలు ఎంతో ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయాయి అంటూ ఆ గుడ్ న్యూస్ ని పంచుకున్నారు. దానితో వీరికి సన్నిహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Kiara, Siddharth share good news