ఉత్తరాంధ్ర జానపద కోకిల `గర్విడి లక్ష్మి`

Story of Garividi LakshmiStory of Garividi Lakshmi

ఉత్తరాంధ్ర జానపద దిగ్గజం, మరువలేని గాయని `గర్విడి లక్ష్మి`  జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ట్రైలర్ లాంచ్ వేడుక కేవలం సినిమా వేడుకలా కాకుండా అచ్చమైన కళా సంబరంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కమెడియన్ షకలక శంకర్ తనదైన శ్రీకాకుళం యాస, భాషలతో వేదికపై ప్రదర్శించిన బుర్రకథ రూపకం అందరినీ ఆకట్టుకోవడమే కాక, కనుమరుగవుతున్న జానపద కళాకారుల దుస్థితిని కళ్ళకు కట్టింది.

ప్రభుత్వాల ప్రోత్సాహం లోపించడం, తగిన గుర్తింపు, ఆర్థిక భద్రత లేకపోవడం వల్లనే నేడు ఎంతోమంది కళాకారులు వెలుగుకు నోచుకోలేకపోతున్నారు. అయితే కళారంగాన్ని బతికించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు జానపద కళాకారులకు ప్రత్యేక పింఛన్లు , ఆర్థిక సహాయం అందిస్తూ వారిని ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఈ సంస్కృతిని మరింత బలంగా నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదే వేదికపై ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. కళకు, సంగీతానికి భాషా సరిహద్దులు ఉండవని మరోసారి నిరూపించారు. ఉత్తరాంధ్ర మాండలికానికి ప్రాణం పోసిన గర్విడి లక్ష్మి గారి బయోపిక్‌కు తెలంగాణ గడ్డకు చెందిన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ సంగీతం అందించడం ఇందుకు చక్కటి నిదర్శనమని ఆయన కొనియాడారు. విశ్వప్రసాద్ నిర్మాణాత్మక ప్యాషన్‌తో, కొత్త దర్శకుడు గౌరీ నాయుడు ఎంతో హానెస్టీతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్‌లో నటి ఆనంది తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించనున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం మెండుగా ఉండాలని కోరుకుంటూ అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలవుతున్న ఈ అరుదైన చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని చిత్ర యూనిట్ కోరుతోంది.

Garividi Lakshmi Movie