ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Balakrishna roars back on the sets of Dada

సెట్ లోకి బాలయ్య - దాదా వస్తుందా?

Balakrishna roars back on the sets of DadaBalakrishna roars back on the sets of Dada

 

నందమూరి బాలకృష్ణ మోకాలి గాయం నుంచి కోలుకుని దాదా సెట్ లో అడుగుపెట్టారు. దర్శకుడు గోపీచంద్ మలినేని మైసూర్ లో దాదా కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టారు. బాలయ్య అలా సెట్ లోకి అడుగుపెట్టారో, లేదో.. ఇలా దాదా డిసెంబర్ 24 కి రావడం లేదు అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం మొదలైంది.

బాలయ్య సెట్ లోకి రాకముందే గోపీచంద్ ధైర్యంగా డిసెంబర్ 24 న దాదా విడుదల అని అనౌన్స్ చేసారు. ముందు నుంచి అనుకున్న తేదీకే బాలయ్య షూటింగ్ లోకి అడుగుపెట్టారు. కానీ దాదా బ్యాకింగ్ ఆఫ్ అంటూ వస్తున్న వార్తలు చూసి ఇప్పుడు నందమూరి అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

బాలయ్య సెట్ లోకి అడుగుపెట్టారు అని ఆనందించాలో, లేదంటే దాదా రిలీజ్ వాయిదా పడొచ్చనే వార్తలు చూసి బాధపడాలో అనేది వారు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరి ఈ వార్తలపై మేకర్స్ క్లారిటీ ఇస్తారో, లేదంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయిస్తారో చూడాలి.
 

Nandamuri Balakrishna roars back on the sets of Dada