ఇంత ట్రోలింగ్ ఏ నిర్మాత అనుభవించలేదేమో?

Heavy Trolling on Naga VamsiHeavy Trolling on Naga Vamsi


సోషల్ మీడియాలో మంచికి ఎంత ప్రాధాన్యత ఉందొ, చెడుకి అంతకన్నా ఎక్కువ పాపులారిటీ ఉంది. మంచి ఎంత స్పీడుగా స్ప్రెడ్ అవుతుందో తెలియదు కానీ.. చెడు మాత్రం క్షణాల్లో స్ప్రెడ్ అవుతుంది. ఇక సినిమాల విషయం నిర్మాతలైన, హీరోలైన, ఎవ్వరైనా ఆచి తూచి మాట్లాడకపోతే మాత్రం సోషల్ మీడియా ట్రోలింగ్ కి మనం అవకాశం ఇచ్చినట్లే.

ఇక టాలీవుడ్ లో ఏ నిర్మాత ఎలా ఉన్నా సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాత నాగవంశీ మాత్రం సోషల్ మీడియా ట్రోలర్స్ కి దొరికిపోతుంటారు. దానితో ఆయన్ని ఆడేసుకుంటున్నాడు. ఎందుకంటే నాగవంశీ సినిమాలేవీ అనుకున్న సమయానికి విడుదల కావు. అందులోను ఇదిగో విడుదల అదిగో విడుదల అంటూ ఊరించి మరీ ఆదర్శకుటుంబాన్ని వాయిదా వేయడం పై నాగవంశీ సోషల్ మీడియా ట్రోలర్స్ కి మేత గా మారాడు.

రెండు రోజుల క్రితం సినిమా వస్తుంది అని చెప్పి విడుదలకు మూడు రోజుల ముందు వాయిదా అంటూ ప్రెస్ మీట్ పెట్టడం, అది కూడా సోషల్ మీడియాకి భయపడి వాయిదా వేస్తున్నామని చెప్పడం అన్ని నాగవంశీ ని ట్రోల్ అయ్యేలా చేసింది. సోషల్ ఇండియాలో సినిమాలు అడవు, థియేటర్స్ లోనే సినిమాలు ఆడుతాయి అంటూ నాగవంశీని ఒక ఆట ఆడుకుంటున్నారు.

ఈమధ్య కాలంలో ప్యారడైజ్ సినిమా విడుదలయ్యాక ఎలాంటి ట్రోల్స్ పడ్డాయో అంతకుమించి నాగవంశీ ప్రెస్ మీట్ పై ట్రోల్స్ కనిపిస్తున్నాయి. 

Aadarsha Kutumbam Postponement and Backlash