BB10: వర్షిణి vs అపూర్వ రచ్చ

Bigg Boss 10: Varshini vs ApurvaBigg Boss 10: Varshini vs Apurva

 

బిగ్ బాస్ సీజన్ 10 నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదో వారంలోకి అడుగుపెట్టింది. గత వారం అంటే నాలుగో వారంలో సృష్టి ఎలిమినేట్ అయ్యింది. అసలు సృష్టి ఎలిమినేట్ అవుతుంది అని ఎవరూ ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. షాలిని కన్నా బాగా సృష్టి ఆడుతుంది, షాలిని ఎలిమినేట్ అవ్వకుండా సృష్టి వెళ్లిపోవడం చాలామందికి నచ్చలేదు.

ఇక ఈ వారం వర్షిణి కెప్టెన్ అవడం కూడా ఆడియన్స్ కి నచ్చలేదు. కారణం ఆమె ఆడకుండా మ్యాజికల్ కీ తో గెలిచింది, ఆ కెప్టెన్సీ ని ముఖేష్ గౌడ్ కి ఇచ్చేసి ఆమె డమ్మీ గా కనిపిస్తుంది అని నామినేషన్స్ లో అపూర్వ చెప్పడమే కాదు, నిజంగానే వర్షిణి ముఖేష్ చుట్టూ తిరగడమే పనిగా పెట్టుకుంది. ఆఖరికి ఆమె కెప్టెన్సీ రూమ్ ని బెడ్ ని ముఖేష్ కి ఇవ్వడం అన్ని ఇలా.

అదే నామినేషన్స్ లో అపూర్వ కి వర్షిణి కి మధ్యన రచ్చ జరిగింది. అపూర్వని డిజాస్టర్ కెప్టెన్ అంటే.. అపూర్వ కెప్టెన్సీ బ్యాండ్ నీ దగ్గర ఉంది పవర్ ముఖేష్ దగ్గర ఉంది.. అదే నువ్వు అంటూ అపూర్వ వర్షిణిని రెచ్చగొట్టింది. త్రిగున్, ముఖేష్ గౌడ్ కూడా అపూర్వని టార్గెట్ చేస్తూ ఆమెని నామినేట్ చేసారు.

ఈ వారం నామినేషన్స్ లో ఎవరి మద్యన గొడవ జరిగినా వర్షిణి కి అపూర్వకి మద్యన జరిగిన రచ్చే సోమవారం ఎపిసోడ్ లో హైలెట్ అయ్యింది. 

Varshini Sounderajan Nominations Apoorva in Bigg Boss 10