ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Varshini bows down and touches Mukesh's feet

BB10: ముఖేష్ కాళ్ళు మొక్కిన వర్షిణి

Bigg Boss 10: Varshini bows down and touches Mukesh's feetBigg Boss 10: Varshini bows down and touches Mukesh's feet

 

బిగ్ బాస్ సీజన్ 10 లో ముఖేష్ గౌడ్, వర్షిణి మధ్యన లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యింది. అందరూ టాస్క్ ఆడుతుంటే ముఖేష్, వర్షిణి హౌస్ లో తమ ప్రపంచంలో తాము ఉంటారు. ఇద్దరూ కూర్చుని గుసగుస ఆడుతుంటారు. వర్షిణి ని ఎలిమినేట్ అవ్వకుండా ముఖేష్ గౌడ్ త్యాగం చేసి మరీ కాపాడాడు.

ఇక ఈవారం వర్షిణి సరిగా టాస్క్ పెరఫార్మెన్స్ ఇవ్వలేదు, అలాగే నామినేషన్స్ లో లేదు. కెప్టెన్సీ టాస్క్ ఫైనల్ లో ఝాన్సీ, రామ్ ప్రసాద్, అమన్ లతో పోటీపడిన వర్షిణి ముందే గివ్ అప్ ఇచ్చేసింది. ఆ కెప్టెన్సీ టాస్క్ లో అమన్ విన్ అయ్యి కెప్టెన్ అవుతున్నాడు అనుకునేలోపు వర్షిణి తన దగ్గర ఉన్న మ్యాజికల్ కీ ఉపయోగించింది.

ఇంకేముంది అగ్నిపరీక్ష టీమ్ అవాక్కయింది, వర్షిణి చేతికి కెప్టెన్సీ బ్యాండ్ వచ్చేసింది. ఆతర్వాత త్రిగున్ నేను చెబితేనే వర్షిణి ఆ పని చేసింది అంటే.. ముఖేష్ అన్ని నీకు చెబుతుంది కానీ నాకు చెప్పాడు అన్నాడు. అయితే వర్షిణి కెప్టెన్సీ గెలిచాను అనే ఆనందంలో ముఖేష్ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది.

కానీ ముఖేష్ కాళ్ళు మోక్కనివ్వలేదు, అయినా వర్షిణి ముఖేష్ కాళ్ళు మొక్కేందుకు ప్రయత్నం చేసింది. గత రాత్రి ఎపిసోడ్ లో ఇదే కాస్త ఓవర్ అయ్యింది. అదే ప్రేక్షకులు కూడా అనేది.. మాకేంటీ దరిద్రం అని. 

Bigg Boss Telugu 10