ఒక్క సినిమాపైనే ఆడియన్స్ అటెన్షన్
Audience attention focused on just one movie
ఈ వారం లాంగ్ వీకెండ్. అక్టోబర్ 2 శుక్రవారం గాంధీ జయంతి హాలిడే కలిసిరావడంతో చాలా సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఆదర్శకుటుంబం అక్టోబర్ 2 నుంచి పోస్ట్ పోన్ అయ్యి అక్టోబర్ 9 కి వెళ్లడంతో రేపు శుక్రవారం రాబోయే సినిమాలన్నీ కూల్ గా దిగుతున్నాయి. అయితే ఈ వారం విడుదలవుతున్న సినిమాలన్నిటిలో ఒకే ఒక్క సినిమాపై ఆడియన్స్ అటెన్షన్ కనిపిస్తుంది.
అదే మలయాళ స్టార్ ఫాహద్ ఫాసిల్ నటించిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ చిత్రం. రాజమౌళి కొడుకు కార్తికేయ, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు స్టార్ హీరోలు తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఆ చిత్రానికి నందమూరి బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు.
ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ చిత్రాన్ని పొగుడుతూ ట్వీట్ చేసారు. అంతగా టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫాహద్ ఫాసిల్ మూవీ ని ప్రమోట్ చేస్తుంటే ఆ సినిమాపై తెలుగు ఆడియన్స్ లో ఆటోమాటిక్ గా అటెన్షన్ వస్తుంది. మిగతా చిత్రాలు తెల్ల కాగితం, అనకాపల్లి, తత్త్వం లాంటి చిన్న సినిమాలు ఎంతగా హడావిడి చేసినా డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ముందు చిన్నబోతున్నాయి.
















































