బిగ్ బాస్ 10 లో కొత్త ప్రేమకథ

A new love story in Bigg Boss 10A new love story in Bigg Boss 10


సౌత్ లో మాత్రమే కాదు నార్త్ లోను బిగ్ బాస్ హౌస్ లో కొత్త ప్రేమ కథలు పుడతాయి. ఆ బిగ్ బాస్ ప్రేమకథను కొంతమంది కంటిన్యూ చేస్తే మరికొంతమంది బయటికి రాగానే బ్రేకప్ లా వ్యవహరిస్తారు. బిగ్ బాస్ లో ప్రేమ కథలు కేవలం ఆడియన్స్ అటెన్షన్ కోసమే, ఆ ప్రేమ కథతో పది వారాలు సర్వైవ్ అయ్యేలా కంటెస్టెంట్స్ ప్లాన్ చేసుకోవడం చూస్తున్నాము.

గత సీజన్ లో టాలీవుడ్ లో డిమోన్ పవన్, రీతూ చౌదరిలు ఇలానే లవ్ బర్డ్స్ లా ప్రొజెక్ట్ అయ్యారు. నిన్నటివరకు ఫ్రెండ్స్ లా మెలిగిన పవన్, రీతూ ల మధ్యన బ్రేకప్ అయ్యింది. ఇప్పుడు ఈ సీజన్ అంటే బిగ్ బాస్ 10 హౌస్ లోను రెండు ప్రేమ కథలు నడుస్తున్నాయి. అది ఆడియన్స్ అటెన్షన్ కోసమా, లేదా అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం.

అగ్నిపరీక్ష టీమ్ నుంచి వచ్చిన రోహిత్, షాలిని నడుమ సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ చాలామంది ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. ఇక సీరియల్ నటుడు ముఖేష్ గౌడ్ యాంకర్ వర్షిణి నడుమ ప్రేమ కథ మొదలైంది. అందరూ టాస్క్ ల్లో గొడవపడుతుంటే వారిద్దరూ టాస్క్ లోనే ఉంటూ రొమాన్స్ చేసుకుంటున్నారు.

ఇద్దరూ ఒకే చోట కూర్చుని గుసగుసలాడుతున్నారు. వర్షిణి ఎలిమినేట్ అవ్వకుండా ముఖేష్ గౌడ్ కెప్టెన్సీ, ఇమ్యూనిటీ వదులుకున్నాడు, వర్షిణి వలన ముఖేష్ ఆట పోతుంది అని వైల్డ్ కార్డులు హెచ్చరించినా ముఖేష్ వర్షిణి చుట్టూనే తిరుగుతున్నాడు. అంటే వారి మద్యన ప్రేమ ఉన్నట్టేగా అంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Romance Peak In Bigg Boss Telugu 10