వారణాసి ప్రీ రిలీజ్ బిజినెస్ మైండ్ బ్లోయింగ్
Mind Blowing Business Done For Varanasi
ఎస్ ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ హీరోగా గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్న వారణాసి మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయ్యింది. సూపర్ స్టార్ మహేష్ వారణాసి షూటింగ్ ఫినిష్ చెయ్యడమే కాదు.. లుక్ కూడా మార్చేశారు. ఇకపై రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్, ఇంకా వి ఎఫ్ ఎక్స్ వర్క్ పై ఫోకస్ పెట్టనున్నారు.
ప్రస్తుతం రాజమౌళి తన కొడుకు కార్తికేయ, శోభు యార్లగడ్డ నిర్మించిన ఫాహద్ ఫాసిల్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే పనిలో ఉన్నారు. తాజాగా వారాణసి ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలపై ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో వారణాసి బిజినెస్ లెక్కలు సుమారు రూ.270 కోట్లకి పైగానే జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అంతేకాదు వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్ల బిజినెస్ అంటూ ఓ లెక్క వైరల్ అవుతుంది. అది కూడా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి రూ.1000 కోట్ల మేర వారణాసి ప్రీ రిలీజ్ బిజినెస్ అంటూ అందరికి షాకిస్తుంది. మరి ఇదే నిజమైతే వారణాసి సంచలనం సృష్టించినట్టే.
















































