ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: This week nominations list

BB10: ఈవారం నామినేషన్స్ లిస్ట్

Bigg Boss 10: This week nominations listBigg Boss 10: This week nominations list


బిగ్ బాస్ సీజన్ 4 మొదలై ఈ వారం పూర్తయితే నెల కావొస్తుంది. మూడు వారాల్లో ముగ్గురు హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయారు. 16మంది డైరెక్ట్ హౌస్ మేట్స్, ఇద్దరు వైల్డ్ కార్డ్స్ తో కలిపి మొత్తం 18 మంది హౌస్ లో ఉండగా.. చైత్ర రాయ్, కృష్ణుడు, మిథిలేష్ లు ఎలిమినేట్ అయ్యారు.

ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ రసాభాసగా నడిచింది. ఎక్కువ హౌస్ మేట్స్ త్రిగుణ్ ని నామినేట్ చేసారు. త్రిగుణ్ vs రోహిత్, త్రిగుణ్ vs అపూర్వ అన్నట్టుగానే ఈ నామినేషన్స్ నడిచాయి. ఈ వారం నామినేషన్స్ లో త్రిగుణ్, రోహిత్, అమన్, అపూర్వ మధ్య జరిగిన నామినేషన్ గొడవలు  హైలైట్‌గా నిలిచాయి.

బిగ్ బాస్ భైరవ టీమ్ సభ్యులకు ఒక్కొక్కరిని నామినేట్ చేసే అవకాశం ఇవ్వగా, సప్తశక్తి టీమ్ నుంచి ఇద్దరికి మాత్రమే నామినేషన్ పవర్ ఇచ్చారు. ఇక ఈ వారం నామినేషన్స్ లోకి ముఖేష్ గౌడ, త్రిగుణ్, దేబ్జానీ, రోహిత్, షాలిని, అమన్, నరేష్, చరణ్, సృష్టి లు వచ్చారు. ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగానే త్రిగుణ్ డామినేషన్ మొదలైపోయింది. చాలామంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. అందులో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. 

Bigg Boss 10