స్లమ్ డాగ్ విడుదలకు ముందు ఏంటి గోల
Puri Jagannadh, Charmee accused of cheating
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా టబు కీలక పాత్రలో తెరకెక్కిన స్లమ్ డాగ్ చిత్ర విడుదల తేదీపై అందరిలో క్యూరియాసిటీ కనిపిస్తుంటే.. పూరి జగన్నాధ్ మాత్రం స్లమ్ డాగ్ విడుదల తేదీ విషయంలో చాలా వెయిట్ చేయిస్తున్నారు. అదలా ఉంటె.. స్లమ్ డాగ్ విడుదల ముందు పూరిపై ఇప్పుడొక లేడీ ప్రొడ్యూసర్ పూరి పై ఆరోపణలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
పూరి ఇంకా ఛార్మి తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా థియేట్రికల్ పంపిణీ హక్కుల కొనుగోలు వల్ల తాము ఏకంగా రూ. 35 కోట్ల నుండి రూ. 40 కోట్ల వరకు నష్టపోయామని నిర్మాత చైతన్య రెడ్డి ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగా చేసిన కామెంట్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.
డబుల్ ఇస్మార్ట్ విడుదలకు ముందు తమ దగ్గరకు వచ్చి ఆ సినిమాని విడుదల చెయ్యాలని, లేదంటే తమకు చావే దిక్కు అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసారని, ఆ సినిమా విడులయ్యాక నష్టాలొస్తే తమకు ఓ సినిమా చేస్తామని చెప్పి సినిమా విడుదలయ్యాక తమ ఫోన్స్ కూడా ఎత్తడం లేదు, మా నంబర్స్ బ్లాక్ చేసారు అంటూ చైతన్య రెడ్డి పూరి జగన్నాధ్ ఇంకా చార్మ్ లపై బహిరంగ ఆరోపణలు చేసింది.
మరి పూరి జగన్నాధ్ తెరకెక్కించిన స్లమ్ డాగ్ విడుదలకు ముందు పూరి జగన్నాధ్ పై ఇలాంటి ఆరోపణలు వలన ఆయన సినిమాపై ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు.
















































