వారసుడి పేరు రివీల్ చేసిన నారా రోహిత్
Nara Rohit reveals his son name
నారా రోహిత్ గత ఏడాది హీరోయిన్ సిరి లెల్ల ను ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో సిరి ని నిశ్చితార్ధం చేసుకున్న కొద్ధి నెలలకే నారా రోహిత్ తండ్రి మరణించడంతో ఏడాది మాసికం వరకు ఆగి సిరి మెడలో నారా రోహిత్ మూడు ముళ్ళు వేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతుల చేతుల మీదుగా నారా రోహిత్-సిరి ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
నారా రోహిత్-సిరి లు రీసెంట్ గా వారసుడికి జన్మనిచ్చారు. నారా వారి వారసుడికి నారా రోహిత్ నందన్ రామ నారా అని నామకరణమ్ చేసి తన కొడుకు ని కూడా ఈ సందర్భంగా రివీల్ చేసారు. నారా రోహిత్-సిరి లెల్ల లు కొడుకుని ఎత్తుకున్న ఫొటోస్ ను, తన కొడుకు పేరుని సోషల్ మీడియాలో షేర్ చేసారు.
కొడుకుని ఎత్తుకున్న భార్య సిరితో బ్యూటిఫుల్ ఫొటోస్ కు ఫోజులిచ్చిన నారా రోహిత్ కి సన్నిహితులు, స్నేహితులు శుభాకంక్షాలు తెలుపుతున్నారు. నారా రోహిత్-సిరి ల కొడుకు ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
















































