బేబీ వయసుపై ఎందుకంత కాంట్రవర్సీ
Vaishnavi Chaitanya Clarifies About Her Age Rumours
యూట్యూబర్ గా ఫేమస్ అయ్యి తర్వాత వెండితెరపై హీరోకి చెల్లెలి క్యారెక్టర్స్ తో ఇండస్ట్రీకి పరిచయమైన వైష్ణవి చైతన్య బేబీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అమ్మడు అద్భుతమైన హిట్ అందుకుంది. ఆ చిత్రంలో వైష్ణవి చైతన్య నటనను సినీ విమర్శకులు పొగిడేశారు.
బేబీ తర్వాత వైష్ణవి చైతన్య కు మళ్లీ అలాంటి హిట్ దక్కలేదు. ఆమె ఏ సినిమా చేసినా అవి షెడ్డు కెళ్ళిపోతున్నాయి. రీసెంట్ గా ఎపిక్ కూడా ఆమెకు షాక్ ఇచ్చింది. అయితే తాజాగా వైష్ణవి చైతన్య ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లవుతుంది, ఆమె వయసు ఓ 30, 32 ఉంటాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆమె చెక్ పెట్టింది.
ఓ పాడ్ క్యాస్ట్ లో పాల్గొన్న వైష్ణవి చైతన్య ను యాంకర్ ఈ ఏజ్ పై వస్తున్న వార్తలపై ప్రస్తావించగా తనకు అంత వయసు లేదు అని, తన వయసు 25 అంటూ ఆమె తన ఆధార్ కార్డు ని చూపించడం హాట్ టాపిక్ అయ్యింది. తనకు నిజంగా 32 ఏళ్లు ఉంటె ఆ విషయం చెప్పడానికి తనకు ఎలాంటి భయం కానీ మొహమాటం కానీ లేదు, తనకు ఇప్పుడు 25 ఏళ్లే అని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేసింది.
















































