అవతార్ తో రాకా పోలిక: రియాక్ట్ అయిన AA టీమ్
Raaka: Allu Arjun's manager clarifies their take amid 'Avatar' comparisons
కోలీవుడ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి.. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న రాకా చిత్రం పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అవతార్ విజువల్స్ కన్నా రాకా విజువల్స్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తాయంటూ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో రకరకాల రియాక్షన్స్ వినిపించాయి.
అవతార్ తో రాకా ని పోలుస్తున్నారు, మరీ ఎక్కువవలా అంటూ మాట్లాడడం, ఓ అల్లు అభిమాని ప్రమోషన్స్ లో మరీ హడావుడి చేయొద్దు, అవతార్ లాంటి గొప్ప చిత్రాలతో మన సినిమాను పోల్చడం వల్ల ఫ్యూచర్ లో ప్రోబ్లెంస్ వస్తాయని సూచించడంతో.. అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు రియాక్ట్ అయ్యారు.
మాకు రాకా కథపై పూర్తి నమ్మకం ఉంది, కంటెంట్ మాత్రమే మాట్లాడుతుంది. మీ సూచనకు ధన్యవాదాలు. గ్లోబల్ ట్రయంఫ్ అనే పదాన్ని ఓ ప్రత్యేక కారణంతోనే వాడాం. ఆ విషయం త్వరలోనే మీ అందరికీ తెలుస్తుంది. రాకా యూనిట్ ఎప్పుడూ ఈ సినిమాను ఇతర గొప్ప సినిమాలతో పోల్చలేదు.. అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.
















































