కాకా: మెగా లీక్స్
Chiru Leaks His Character Name As Kadiri Kalidas In Kaakaబ్లాక్‌బస్టర్ వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ కాకా. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచే అప్‌డేట్ వచ్చింది. ఓ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన క్యారెక్టర్ పేరును రివీల్ చేశారు. ‘కాకా’లో చిరంజీవి ‘కదిరి కాళిదాస్’గా కనిపించబోతున్నారు. ఈ పవర్‌ఫుల్ పేరు వినగానే సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి మరింత పెరుగుతోంది.
‘కాకా’ హై-ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బలమైన ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌కు కూడా ప్రాధాన్యత ఉంది. దీంతో సినిమాలో కదిరి కాళిదాస్ క్యారెక్టర్ జర్నీ, ఎమోషనల్ ఆర్క్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
‘కాకా’ 2027 జనవరి 13న సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, అనశ్వర రాజన్
















































