అక్టోబ‌ర్ 7 త‌ర్వాత మ‌హేష్ చిక్క‌డు దొర‌క‌డు

Superstar Mahesh BabuSuperstar Mahesh Babu

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి - సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం అత్యంత కీలకమైన వారణాసి షెడ్యూల్ నడుస్తుండగా..ఇది అక్టోబర్ మొదటి వారానికల్లా పూర్తిగా ముగియనుందని సమాచారం.

ముఖ్యంగా ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబుకి సంబంధించిన ప్రధాన సన్నివేశాలు కేవలం వారంలోనే కంప్లీట్ కానున్నట్లు తెలుస్తోంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ నేపథ్యం, రాజమౌళి మార్క్ గ్రాండియర్ విజువల్స్, అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఈ షెడ్యూల్‌కి ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ విజువల్ వండర్‌ను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు.

ఇక ఈ భారీ చిత్రం పూర్తికాగానే మహేష్ బాబు తదుపరి ఏ దర్శకుడితో ప్రాజెక్ట్ ప్రారంభిస్తారనే దానిపై ఇప్పటికే టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ లేదా సందీప్ రెడ్డి వంగా వంటి ప్రముఖ డైరెక్టర్లతో మహేష్ తదుపరి సినిమాలు ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-రిలీజ్ బిజినెస్ డీలింగ్స్ ఇప్పటినుంచే ట్రేడ్ సర్కిల్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజమౌళి-మహేష్ కాంబో క్రేజ్ కారణంగా నాన్-థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ , ఓవర్సీస్ రైట్స్ కోసం ప్రొడ్యూసర్లు పోటీపడుతుండటంతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఆల్-టైమ్ రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది

Mahesh Babu Varanasi