షర్ట్ విప్పేసి ట్రోలర్స్ కి సమాధానమిచ్చిన సల్మాన్
Angry Salman Khan removes shirt during Bigg Boss 20
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 20 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో వీకెండ్ ఎపిసోడ్ లో సల్మాన్ ఖాన్ షర్ట్ విప్పేసి సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తూ చేసిన విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సల్మాన్ ఖాన్ తన షర్ట్ విప్పింది తన శరీరాకృతిని షో చెయ్యడానికి కాదు, ట్రోలర్స్ కి సమాధానమివ్వడానికి.
రీసెంట్ గా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ పై బాడీ షేమింగ్ ట్రోల్స్ ఎంతగా కనిపించాయో చూసాము. ఆ విషయమై సల్మాన్ మాట్లాడుతూ ప్రెగ్నెంట్ వచ్చాక ఏ మహిళ అయినా బరువు పెరుగుతుంది. ఒక మహిళను బరువు పేరుతొ ట్రోల్ చెయ్యడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం తల్లిగా మారిన కత్రినా తన ఫ్యామిలీతో సమయం గడుపుతుంది.
మళ్లీ నటించాలని ఉన్నప్పుడు పూర్వం మాదిరి స్లిమ్ గా మారుతుంది. ఇలాంటి ట్రోల్స్ ని కత్రినా అస్సలు పట్టించుకోకూడదు. సోషల్ మీడియా ద్వారా అనేకమంది బ్రతుకుతున్నారు, కానీ ఇతరులను కించపరుస్తూ డబ్బు సంపాదించడం కరెక్ట్ కాదు, ఇతరుల వైఫల్యాలను చూసి సంతోషపడేవారు చాలామందే ఉన్నారు.
నన్ను కూడా ముసలోడిని అయిపోయానని ట్రోల్ చేస్తుంటారు.. అంటూ షర్ట్ విప్పి.. అవును నాకు 60 ఏళ్లు. నేను ఎప్పటికీ మైనే ప్యార్ కియా నాటి కుర్రాడిలాగే కనిపించలేను కదా, వయసు పెరగడం అనేది చాలా సాధారణం అంటూ సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ స్టేజ్ పై ట్రోలర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు.
















































