దాదా: ఎమోషనల్ గ్యాంగ్ స్టర్ డ్రామా
Dada: Emotional Gangster Drama
నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా దాదా చిత్రం డిసెంబర్ 24 రిలీజ్ అంటూ అనౌన్స్ చేసారు. బాలయ్య ప్రస్తుతం మోకాలి ఇంజ్యురితో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన ఎప్పుడెప్పుడు దాదా సెట్ లోకి వస్తారా అని అభిమానులే కాదు ఆయన కూడా అంతే వెయిట్ చేస్తున్నారు.
అతి త్వరలోనే బాలయ్య దాదా సెట్ లోకి వెళ్ళబోతున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య మాసివ్ అవతార్ లో కనిపిసున్నారు. దాదా టైటిల్ ఇంకా బాలయ్య బర్త్ డే గ్లింప్స్ చూస్తే ఇది గ్యాంగ్ స్టార్ డ్రామా అని అర్ధమైపోతుంది. అయితే ఇది కేవలం గ్యాంగ్ స్టార్ డ్రామాగానే కాదు ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతుందట.
అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ తో గ్యాంగ్ స్టర్ డ్రామా గా ఈ చిత్రం ఉండబోతుంది. అంటే అటు మాస్ ఆడియన్స్ కి ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కి దాదా పర్ఫెక్ట్ గా ఎక్కేలా గోపీచంద్ ప్లాన్ చేస్తున్నాడన్నమాట. ఇక ఈ చిత్రంలో మంచు మనోజ్ కీ రోల్ ప్లే చేస్తుండగా.. కాజల్ బాలయ్య కి జోడిగా కనిపిస్తుంది.
















































