దాదా కి క్రేజీ ఓటీటీ డీల్

Dada signs a record deal  Dada signs a record deal

 

నటసింహ బాలయ్య దాదా తో మాస్ ఆడియన్స్ ని ఊపేసేందుకు రెడీ అవుతున్నారు. మరో మూడు నెలల్లో దాదా తో బాలయ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం మోకాలి ఇంజ్యురితో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న బాలయ్య ఎప్పుడెప్పుడు దాదా సెట్ లోకి వెళదామా అని వెయిట్ చేస్తున్నారు.

అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి గోపీచంద్ మైసూర్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు. బాలయ్య బర్త్ డే గ్లింప్స్ తోనే ఈ ప్రాజెక్టు పై భీభత్సమైన అంచనాలు మొదలయ్యాయి. ఇప్పడు అదే అంచనాలతో ప్రముఖ ఓటీటీ సంస్థ ఒకటి దాదా కి బిగ్ డీల్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాదా డిజిటల్ రైట్స్ కోసం జీ 5 సంస్థ బిగ్ డీల్ కోట్ చేసినట్లుగా తెలుస్తుంది.

జీ 5 ఈ సినిమా డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్‌ను ఏకంగా రూ.70 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ముంబై అండర్‌వరల్డ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఉన్న అంచనాల కారణంగానే జీ 5 కళ్ళు చెదిరే ఆఫర్ ని దాదా మేకర్స్ కి ఇచ్చినట్లుగా తెలుస్తుంది.

మరి బాలయ్య విజయాల్లో అఖండ 2 ని తీసేస్తే దాదా ప్రాఫిట్ తీసుకురావడం ఖాయమనే ఊపులోనే జీ 5 డిజిటల్ రైట్స్ కోసం అంత పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో మంచు మనోజ్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారు 

Dada inks a crazy deal