ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sandeep Reddy Vanga Suggests Historic Names for Warangal International Airport

దట్స్ ది స్పిరిట్ అంటూ రేవంత్.. రియాక్ట్ అయిన సందీప్

Sandeep Reddy Vanga Suggests Historic Names for Warangal International AirportSandeep Reddy Vanga Suggests Historic Names for Warangal International Airport

 

వరంగల్ లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడం అనేది ఆ ప్రాంత వాసుల దశాబ్దాల కల. తాజాగా ఆ కల నెరవేరిన సందర్భంగా వరంగల్ వాసి అయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ సొంత పట్టణానికి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

వరంగల్ ఎయిర్ పోర్ట్ కు రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (RIA), కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (KIA) వంటి చారిత్రక పేర్లను సందీప్ రెడ్డి వంగా సూచించారు. ఆయన సూచనకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి 'దట్స్ ది స్పిరిట్..' అంటూ ఎక్స్(ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. సీఎం స్పందన పట్ల సంతోషాన్ని తెలియజేస్తూ..

తను ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిస్తున్న స్పిరిట్ సినిమాలో దట్స్ ది స్పిరిట్ అనే డైలాగ్ ను రాశానని, అదే మాట సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి రావడం ఆనందంగా ఉందని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు. సందీప్ రెడ్డి వంగా, సీఎం రేవంత్ రెడ్డి మధ్య సోషల్ మీడియా ద్వారా జరిగిన ఈ సంభాషణ నెటిజన్స్ దృష్టిని బాగా ఆకర్షిస్తోంది.

Sandeep Suggests Historic Names for Warangal International Airport; CM Revanth Reddy Responds, That’s the Spirit..