ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nani Says Women Should Wear Braids, Blames Western Culture

మహిళల హెయిర్‌స్టైల్‌పై నాని ఆసక్తికర వ్యాఖ్యలు!

 Nani Says Women Should Wear Braids, Blames Western CultureNani Says Women Should Wear Braids, Blames Western Culture

నేచుర‌ల్ స్టార్  నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న `ది ప్యారడైజ్`  ప్రమోషన్లలో భాగంగా కర్ణాటకలో జరిగిన మీడియా సమావేశంలో నాని చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. మహిళలు సాంప్రదాయకంగా జడలు వేసుకోవడం తగ్గిపోయిందని.. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల ఇలా జరుగుతోందని ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాలో తన పాత్ర జడల్ గురించి నాని మాట్లాడుతూ నేటికాలంలో మహిళలు జడలు వేసుకోవడం లేదని, జడ వేసుకుంటే మహిళలు చాలా అందంగా కనిపిస్తారని వ్యాఖ్యానించారు. పాశ్చాత్య సంస్కృతికి ప్రభావితం కాకుండా మళ్లీ పూర్వపు పద్ధతులకు వెళ్లి జడలు వేసుకోవాలని, తలనూనె రాసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి బలంగా తయారవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే ప్రెస్ మీట్‌లో ఉన్న మహిళా విలేకరులు నాని వ్యాఖ్యలపై కౌంటర్ వేసారు. నేటి ఆధునిక జీవితంలో మహిళలకు జుట్టు నిర్వహణకు తగినంత సమయం ఉండటం లేదని, అందంగా కనిపించడం వెనుక ఎంతో శ్రమ ఉంటుందని గుర్తుచేశార. అలాగే  నాని కూడా సినిమాలో సొంత జుట్టు పెంచకుండా విగ్ వాడినప్పుడు, మహిళలకు ఉచిత సలహాలు ఇవ్వడం సరికాదని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

మహిళా విలేకరి వ్యాఖ్యలకు నాని న‌వ్వుతూ స్పందించారు. తాను ఒక నటుడిగా పాత్ర అవసరాల మేరకు విగ్ వాడానని వివరణ ఇచ్చారు. జుట్టు నిర్వహణలోని కష్టాలను తాను కూడా గత ఏడాదిన్నరగా అనుభవిస్తున్నానని, మహిళలందరి పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని పరిస్థితిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎక్స్ వేదికగా నెటిజన్లు నానిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. హార్డ్ వాటర్ సమస్యలు, సమయాభావం వంటి అనేక అంశాలను ఎదుర్కొంటున్న మహిళలకు ఏమి చేయాలో చెప్పడం మానేసి, వ్యక్తిగత అభిప్రాయాలను పక్కనబెట్టి కేవలం సినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టాలని పలువురు సూచించారు.
 

Nani spoke humorously about the film's signature jadal hairstyle