రాకా పై డైరెక్టర్ సిబి చక్రవర్తి హైప్
Director Cibi Chakravarthy builds hype around Raaka
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న రాకా చిత్రంపై భీభత్సమైన అంచనాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కుతున్న రాకా చిత్ర రిలీజ్ డేట్, అలాగే అప్ డేట్స్ పై అభిమానుల్లో క్యూరియాసిటీ అంతకంతకు ఎక్కువైపోతోంది.
తాజాగా కోలీవుడ్ టాప్ డైరెక్టర్ సిబి చక్రవర్తి రాకా పై హైప్ క్రియేట్ చేసే కామెంట్స్ చేసారు. అట్లీ సర్ ఇండియన్ సినిమా గర్వించేలా చేసే ఒక అద్భుతాన్ని సృష్టిస్తున్నారు. ఆయన నాకు చూపించిన విజువల్స్ నా ఊహలకు అందనంత అద్భుతంగా ఉన్నాయి.హాలీవుడ్ అవతార్ వంటి చిత్రాల్లో కూడా నేను ఇలాంటి విజువల్స్‌ను చూడలేదు.
మరో 3 రోజుల్లో ప్రపంచం మొత్తం ఒక అసాధారణమైన అనుభూతిని చూడబోతోంది. ఎస్ ఎస్ రాజమౌళి సర్ భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లినట్లే, రాకా చిత్రంతో తో అట్లీ సర్ భారతీయ సినిమాను గ్లోబల్ స్టేజ్‌పైకి తీసుకెళ్తున్నారని నేను నిజంగా నమ్ముతున్నాను అంటూ సిబి చక్రవర్తి ట్వీట్ రాకా పై విపరీతమైన హైప్ ని క్రియేట్ చేస్తుంది.















































