గ్లామర్ షో తో కిక్ ఇస్తున్న హీరోయిన్
Kayadu Lohar glamour look goes viral
ది ప్యారడైజ్ హీరోయిన్ కాయదు లోహర్ ప్రస్తుతం ప్యారడైజ్ ప్రమోషన్స్ లో కనిపించడం లేదు కానీ.. అమ్మడు సోషల్ మీడియాలో ఫొటోస్ అది కూడా గ్లామర్ షో చేస్తూ షేర్ చేస్తుంది. ఆమె మరో సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో, ఆ సినిమా డైరెక్టర్ మారి సెల్వరాజన్ కాయదు కు పర్మిషన్ ఇవ్వకపోవడంతో కాయదు ప్యారడైజ్ ప్రమోషన్స్ కు రావడం లేదు అని నాని సిల్లీ రీజన్ ఇచ్చారు.
ఎంత పెద్ద సినిమా అయినా షూటింగ్ కి బ్రేకిచ్చి రిలీజ్ అయ్యే సినిమా ప్రమోషన్స్ కోసం టైమ్ కేటాయించాలి. కానీ కాయదు రాలేదు. దానితో ప్యారడైజ్ టీమ్ తో ఆమెకు పడడం లేదు అందుకే కాయదు లోహర్ ప్యారడైజ్ ప్రమోషన్స్ కు రావడం లేదు అంటున్నారు. ఏది ఏమైనా ప్యారడైజ్ కి డ్రై ప్రమోషన్స్ తప్ప కలర్ ఫుల్ ప్రమోషన్స్ కనిపించడం లేదు.
ఇక ప్యారడైజ్ ప్రమోషన్స్ ను లైట్ తీసుకున్న కాయదు లోహర్ తాను ఉన్నాను అంటూ ఉనికి చాటుకుంటూ.. సోషల్ మీడియాలో తాజాగా వదిలిన పిక్స్ చూస్తే వావ్ కాయదు నిన్ను బాగా మిస్ అవుతున్నాం అంటారు. క్రీమ్ కలర్ మోడ్రెన్ వేర్ లో కాయదు లోహర్ గ్లామర్ షో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.















































