శ్రుతి హాసన్ కు అలాంటి సమస్యా?
Shruti Hassan says she prayed about thousand times that men get periods
కోలీవుడ్ నటి శృతి హాసన్ ఈ మధ్యన సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలోనే యాక్టీవ్ గా ఉంటుంది. ఇక ఏ విషయమైనా చాలా ఓపెన్ గా మాట్లాడే శృతి హాసన్ తాజాగా తనకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఏం జరిగిందో, తన మెచ్యూర్ అయ్యాక తను పడిన ఇబ్బందులు ఏమిటో అనేది సోహా అలీఖాన్ నిర్వహించిన ఓ పాడ్ కాస్ట్ లో చెప్పుకొచ్చింది.
తనకి 13 ఏళ్ళ వయసులో పీరియడ్స్ వచ్చినప్పుడు అమ్మతో చెబితే ఆమె చాలా సంతోషించింది. పీరియడ్స్ వచ్చిన రెండు గంటల నుంచి నేను కడుపు నొప్పితో తల్లడిల్లిపోయాను. అమ్మ కూడా ఇలాంటి నొప్పులనే అనుభవించారు. అమ్మలాగే నాకు కూడా కడుపు నొప్పి రావడం చూసి తను ఎంతో బాధపడ్డారు.
పీరియడ్స్ సమయంలో స్కూల్ లో వాంతులు చేసుకోవడం, కళ్లు తిరిగి పడిపోవడం తరచూ జరగడమే కాదు.. అది తట్టుకోలేక హాస్పిటల్ కి వెళ్లి ఐవీ ఫ్లూయిడ్స్, ఎక్కించుకుని పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం చేసేదాన్ని. ఇక సినిమా షూటింగ్స్ సమయంలో పీరియడ్స్ వస్తే.. డాన్స్, అలాగే యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్నప్పుడు చాలా ఇబ్బందిపడేదాన్ని,
ఓపిక ఉండేది కాదు, పక్కకు వెళ్లి వామిటింగ్స్ చేసుకునేదాన్ని. కరోనా సమయంలో హైదరాబాద్ లో ఓ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వలన చాలా వరకు సమస్య నుంచి బయటపడ్డాను అంటూ శృతి హాసన్ ఆ పాడ్ కాస్ట్ లో చెప్పుకొచ్చింది.















































