ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> At Salman Khan's Ganesh Chaturthi Festivities

అభిమానుల మధ్య సల్మాన్ సంస్కారం

At Salman Khan's Ganesh Chaturthi FestivitiesAt Salman Khan's Ganesh Chaturthi Festivities

 

గణేష్ చతుర్థి వేడుకల్లో భాగంగా బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ వినయపూర్వక ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఇటీవల  రాజకీయ నాయకుడు ఆశిష్ షెలార్ నివాసానికి వెళ్ళి గణపతి దర్శనం చేసుకున్న అనంతరం అక్కడ భారీగా చేరుకున్న అభిమానుల రద్దీని చూసి సల్మాన్ నమస్కరిస్తూ దారి ఇవ్వాలని వేడుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్  వైరల్ అవుతోంది.

ఆశిష్ షెలార్ నివాసం వద్ద పూజల అనంతరం బయటకు వచ్చిన సల్మాన్ ఖాన్‌ను చుట్టూ కెమెరా మెన్లు..  అభి మానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. తలపై బిన్నీ క్యాప్, నొసటన తిలకంతో క్యాజువల్ దుస్తుల్లో కనిపించిన సల్మాన్ కారు వైపు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జనం  తోసుకురావడంతో స‌ల్మాన్ రెండు చేతులెత్తి నమస్కరిస్తూ అభిమానులను  వెనక్కి జరిగి దారి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఈ తోపులాట సమయంలో ఓ చిన్నారి సల్మాన్ ఖాన్‌తో కరచాలనం చేయడానికి  దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నిం చాడు. ఆ సమయంలో సల్మాన్ సెక్యూరిటీ సిబ్బంది ఆ బాలుడిని పక్కకు నెట్టివేసేందుకు ప్రయత్నించగా వెంటనే స్పందించిన సల్మాన్  సెక్యూరిటీని వారించారు. ఆ బాలుడితో చిరునవ్వుతో షేకండ్ ఇచ్చి జనం రద్దీలోంచి సురక్షితంగా పక్కకు పంపి  ఉదారతను చాటుకున్నారు.

Salman Khan celebrated Ganesh Chaturthi