భారమంతా మౌత్ టాక్ పైనే!
The Paradise Promotional update
నాని ది ప్యారడైజ్ చిత్రం విడుదలకు కేవలం వారం మాత్రమే సమయం ఉంది. సెప్టెంబర్ 24 న విడుదల కాబోతున్న ప్యారడైజ్ చిత్రానికి ప్రమోషన్స్ కూడా లిమిటెడ్ గానే ఉండబోతున్నాయి. నాని నిన్నమొన్నటివరకు షూటింగ్ లో పాల్గొన్నారు. శ్రీకాంత్ ఓదెల పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా వున్నారు.
దానితో ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ప్యారడైజ్ టీం ప్రమోషన్స్ చెయ్యడానికి హరిబారిగా గా పరుగులుపెట్టాలి. చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, కొచ్చి లో ప్యారడైజ్ ప్రమోషనల్ టూర్ ప్లాన్ చేసింది టీమ్. ఈ వారంలో ఈరోజు చెన్నై ప్రెస్ మీట్ జరగబోతుంది. అక్కడో ప్రెస్ మీట్, ఇక్కడో ప్రెస్ మీట్ పెట్టేసి వస్తారు. దానికే సినిమాపై క్రేజ్ వచ్చేస్తుంది అనుకుంటే పొరబాటే.
సినిమా విడులయ్యాక బావుంది అంటూ మౌత్ టాక్, ఇంకా సోషల్ మీడియా టాక్ మాత్రమే నాని ప్యారడైజ్ చిత్రాన్ని సేవ్ చెయ్యాలి. ప్యారడైజ్ భారమంతా మౌత్ టాక్ పైనే ఆధారపడివుంది. అయితే ప్రస్తుత లిమిటెడ్ ప్రమోషన్స్ తో నాని ప్యారడైజ్ కి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో అనే విషయంలో సినిమా ఇండస్ట్రీలోనే కాదు కామన్ ఆడియన్స్ లోను క్యూరియాసిటీ కనిపిస్తుంది.
















































