ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Fauzi Pushing From December To January

జనవరికి ఫిక్స్ చేస్తావా ప్రభాస్

Fauzi Pushing From December To JanuaryFauzi Pushing From December To January


డిసెంబర్ 3 నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫౌజీ పోస్ట్ పోన్ అవడం పక్కానే. అందుకే నాగ చైతన్య వృషకర్మ ని ఆ డేట్ కి ఫిక్స్ చేసారు మేకర్స్. అయితే ప్రభాస్ ఫౌజీ ని క్రిస్మస్ కి విడుదల చేస్తారా, లేదంటే జనవరా అనే విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ లో ఎడతెగని ఉత్కంఠ నడుస్తుంది.

క్రిస్మస్ బరి క్రేజీనే, అలాగ జనవరి సంక్రాంతి బాక్సాఫీసు బరి కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయ్యింది. మరి హను రాఘవపూడి ఫౌజీ ని ఎప్పుడు విడుదల చెయ్యబోతున్నారు, ఫౌజీ విడుదల తేదీని బట్టి స్పిరిట్ విడుదల తేదీ ఫిక్స్ అవుతుంది. లేదంటే స్పిరిట్ రిలీజ్ డేట్ అయోమయంలో పడుతుంది.

క్రిస్మస్ కి షారుఖ్ ఖాన్ కింగ్ రాబోతున్నట్టుగా ప్రకటించారు. సో ఫౌజీ ఆ డేట్ ని వాడుకోలేదు. ఇక సంక్రాంతి కూడా ఫుల్. మరి ప్రభాస్ కూడా సంక్రాంతికి ఏమైనా మొగ్గు చూపుతారా, జనవరినే ప్రభాస్ ఫౌజీ విడుదల ఫిక్స్ అయ్యేలా ఉంది అనే మాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Fauzi Release Update