ట్రెడిషనల్ గా సమంత సీమంతం
Samantha recently celebrated an intimate and beautiful baby shower ceremon
గత ఏడాది దర్శకుడు రాజ్ నిడిమోరు ను ప్రేమ వివాహం చేసుకున్న సమంత పెళ్లి తర్వాత ఎంతో ఆనందంగా కనిపించడమే కాదు.. పెళ్లి తర్వాత నటనను కంటిన్యూ చేస్తూ మా ఇంటి బంగారం సినిమా కూడా చేసింది. నిర్మాతగా, అలాగే లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ చిత్రం షూటింగ్ లోనే సమంత ప్రెగ్నెంట్ అని తెలియడంతో ఆ చిత్రం సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఆ విషయాన్ని రివీల్ చేసింది.
ఆతర్వాత భర్త తో కలిసి చలాకీగా బేబీ మూన్ వెకేషన్ అంటూ హడావిడి చెయ్యడమే కాకుండా తమిళనాట కుకింగ్ షో కి హోస్ట్ గా చేస్తుంది. రీసెంట్ గా హైదరాబాద్ వచ్చి వెళ్లిన సమంతకి ఈరోజు వినాయకచవితి పర్వదినాన ఫ్యామిలీ మెంబెర్స్ సీమంతం వేడుకలను సంప్రదాయం గా నిర్వహించారు.
సమంత అత్తింటి ఆచారం ప్రకారం గోద్ భరాయి(సీమంతం) వేడుకల ఫొటోస్ ను సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వేడుకల్లో ఆమె స్నేహితులు శిల్పా రెడ్డి అలాగే నీరజ కోన లు పాల్గొన్నారు. సమంతకు మంగళ స్నానాల కార్యక్రమంలో శిల్పా రెడ్డి, నీరజ కోన సందడి చేసారు.
ఇక రాజ్ నిడిమోరు తో పెళ్లి దగ్గర నుంచి అన్ని ఆచార సాంప్రదాయాలను ఫాలో అవుతున్న సమంత సీమంతం ఫొటోస్ ని షేర్ చేస్తూ.. మన సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే. ప్రతి ఆచారం నాకు అర్థం కాకపోవచ్చు, కానీ, వాటి వెనుక ఏదో బలమైన శక్తి ఉందని నేను నమ్ముతా. మంత్రోచ్చారణ ద్వారా వెలువడే శక్తిలో, తరాలుగా ఎంతో శ్రద్ధతో అనుసరిస్తున్న ఈ సాంప్రదాయాల్లో లోతైన భావం దాగి ఉందని నాకు అనిపిస్తుంది అంటూ సమంత చెప్పుకొచ్చింది.
















































