ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> A brand-new strategy for box-office success?

బాక్సాఫీస్ వద్ద విజయం సాధించే సరికొత్త వ్యూహమా?

A brand-new strategy for box-office success?A brand-new strategy for box-office success?

సినిమా ప్రమోషన్స్ అంటేనే టీజర్లు, ట్రైలర్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం. అలాంటి వాతావరణంలో ఎలాంటి ట్రైలర్ విడుదల చేయకుండా నేరుగా థియేటర్లలోకి సినిమాను తీసుకురావడం అనేది సాధారణ విషయం కాదు. ఇది ఒక రకమైన సాహసంతో కూడుకున్న నిర్ణయం. దర్శకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక లోతైన ఆలోచనలు, వ్యూహాలు దాగి ఉంటాయి. తాజాగా నాని హీరోగా న‌టిస్తోన్న `ది ప్యార‌డైజ్` ఎలాంటి ట్రైల‌ర్ లేకుండా రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రిలీజ్ వెనుక మాస్ట‌ర్ ప్లాన్ ఏంటి? అన్న దానిపై ఆస‌క్తి  నెల‌కొంది. ఓ సారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే..  

డిజిటల్ యుగంలో ట్రైలర్ విడుదల కాగానే కథ ఏంటి? ట్విస్టులు ఏంటి?  అని ప్రేక్షకులు విశ్లేషించడం మొదలుపెడుతున్నారు. అయితే ట్రైలర్ విడుదల చేయకపోవడం ద్వారా ప్రేక్షక లోకంలో ఒక రకమైన ఆత్రుత‌,  ఉత్సుకత నెలకొంటాయి. సినిమాలో అసలు ఏం దాచారు? ఎందుకు చూపించడం లేదు? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మెదులుతుంది. ఈ నిగూఢత ప్రేక్షకుల దృష్టిని సినిమా వైపు తిప్పుకోవడానికి  మొదటి రోజు థియేటర్లకు రప్పించడానికి ఓ  శక్తివంతమైన సాధనంగా మారుతుంది.

ట్రైలర్ కట్ చేసే క్రమంలో కథలోని కీలకమైన మలుపులు, సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ లేదా అత్యుత్తమ దృశ్యాలు బయటకు వచ్చే ప్రమాదం ఉంది. దర్శకుడు కష్టపడి డిజైన్ చేసిన ప్రతి సన్నివేశాన్ని ఆడియన్స్ నేరుగా పెద్ద తెరపైనే చూసి అనుభవించాలని కోరుకుంటారు. ఎలాంటి  ముందస్తు అంచనాలు  లేకుండా థియేటర్‌లో కూర్చున్నప్పుడే ఆ కథ అందించే థ్రిల్ లేదా ఎమోషన్ వంద శాతం ప్రేక్షకుడికి చేరుతుందని దర్శకుడు న‌మ్మోచ్చు.

ఇక్క‌డ  దర్శకుడికి  కథపై, కథనంపై ఉండే నమ్మకం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రచార ఆర్భాటాల కంటే సినిమా కంటెంటే మాట్లాడుతుందనే ఆత్మవిశ్వాసం ముఖ్యం. తొలి  పడగానే వచ్చే వర్డ్ ఆఫ్ మౌత్  లేదా ఆడియన్స్ ఇచ్చే టాక్ ఏ ట్రైలర్ ఇవ్వలేని మైలేజ్‌ను ఇస్తుంది. సరైన కంటెంట్ ఉంటే ఆర్గానిక్ ప్రచారం ద్వారానే సినిమాను బాక్సాఫీస్ విజేతగా నిలబెట్టవచ్చనేది ప్రధాన వ్యూహం.

రోజుకు పదుల సంఖ్యలో ట్రైలర్లు విడుదలవుతున్నఈ రోజుల్లో ప్రేక్షకులు రొటీన్ పబ్లిసిటీ కంటెంట్‌కు అలవాటుపడిపోయారు. ఇలాంటి సమయంలో ట్రైలర్ లేదు అనే వార్త ఓ పెద్ద ప్రచారంగా మారుతుంది. మీడియాలో, సోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చలు నడుస్తాయి. ప్రమోషన్స్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసే బదులు  విలక్షణమైన నిర్ణయంతోనే ఉచితంగా విస్తృతమైన పబ్లిసిటీని సంపాదించుకోవడం దర్శకుడి మరో  మైండ్ గేమ్ కావొచ్చు.

The Paradise