ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Shah Rukh Khan to work with South Directors?

చాలా కాలంగా `కింగ్` చేప‌ల‌వేట‌!

Shah Rukh Khan to work with South Directors?Shah Rukh Khan to work with South Directors?

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన తదుపరి సినిమాల ఎంపికలో అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పఠాన్, జవాన్ వంటి భారీ విజయాల తర్వాత ప్రస్తుతం క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న`కింగ్` సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన.. భవిష్యత్తులో దక్షిణాది దిగ్గజ దర్శకులతో పనిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. టాలీవుడ్ - కోలీవుడ్ మేకర్స్‌తో వరుస చర్చలు జరుపుతుండటం ట్రేడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

గతంలో జవాన్ వంటి ఇండస్ట్రీ హిట్‌ను అందించిన అట్లీతో షారుఖ్ మరోసారి క‌లిసి ప‌ని చేయ‌డం ఖాయమైంది. అల్లు అర్జున్‌తో అట్లీ `రాకా` సినిమా పూర్తయిన తర్వాత ఈ కాంబినేషన్ పట్టాలెక్కనుంది. అంతేకాకుండా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలోనూ.. అలాగే `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లోనూ నటించేందుకు ఆయన చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతానికి అట్లీ ప్రాజెక్ట్ ఒక్కటే ఫైనల్ అయినా షారుఖ్ వేస్తున్న ఈ అడుగులు సౌత్ మార్కెట్‌పై ఆయన ఎంతగా దృష్టి పెట్టారో స్పష్టం చేస్తున్నాయి.

Shah Rukh Khan is lining up a number of films