ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> When Ranveer Singh opened up about his admiration for Govinda

గోవిందాకు వీరాభిమానిగా 3000 కోట్ల వ‌సూళ్ల హీరో!

When Ranveer Singh opened up about his admiration for GovindaWhen Ranveer Singh opened up about his admiration for Govinda

బాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ సీనియర్ నటుడు గోవిందాపై  అపారమైన అభిమానాన్ని, గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు. హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ  ప్రత్యేకమైన డ్యాన్స్, టైమింగ్, నటనతో శకాన్ని సృష్టించిన గోవిందా తనకు ఎంతో స్ఫూర్తి అని రణ్‌వీర్ తెలిపారు. తాను చిన్నతనం నుంచే గోవింద‌ సినిమాలను చూస్తూ పెరిగానని,  పరిశ్రమలో ఆయనకున్న అతిపెద్ద అభిమానులలో తాను ఒకరిన‌న్నారు.

గోవిందా పనితీరు, నటన శైలి గురించి రణ్‌వీర్ మాట్లాడుతూ `ఆయన విధానం చాలా ఓల్డ్ స్కూల్ (సాంప్రదాయక శైలి)గా ఉంటుంది. కారెక్టర్ లోతుల్లోకి వెళ్లి, టైమింగ్‌తో నవ్వించడం ..భావోద్వేగాలను పండించడం ఆయనకే చెల్లింది. కెమెరా ముందు ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్ మూమెంట్స్ నాలాంటి ఎంతో మంది నటులకు ఒక పాఠ్యాంశం లాంటివి` అని కొనియాడారు. గోవిందాతో కలిసి నటించే అవకాశం రావడాన్ని  అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

రణ్‌వీర్ సింగ్- గోవిందా కలిసి `కిల్ దిల్` అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సెట్స్‌లో గోవిందాతో గడిపిన క్షణాలను రణ్‌వీర్ ఎప్పటికీ మరిచిపోలేనివి. గోవిందా చూపించే ప్యాషన్, నటన పట్ల ఆయనకున్న అంకితభావం నేటితరం నటులకు ఎంతో అవసరమని, ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని రణ్‌వీర్ సూచించారు.

Ranveer has often said he is the biggest fan of Govinda