వైరల్: అజిత్-విజయ్ బ్యూటిఫుల్ వీడియో
Fans surprises as CM Vijay flags Ajith race
కోలీవుడ్ స్టార్స్ విజయ్, అజిత్ కుమార్ మంచి ఫ్రెండ్స్. బయట ఫ్యాన్స్ వార్ జరుగుతుంది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని కొట్టుకోవడమే కానీ.. అజిత్ కానీ విజయ్ కానీ.. ఆ విధంగా ఆలోచించరు. వారు ఎప్పుడు ఫ్రెండ్స్ గానే కనిపిస్తారు. విజయ్ సీఎం అయ్యాక కూడా అజిత్ తో మంచి స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నారు.
అజిత్ తల్లి మరణించిన సమయంలో విజయ్ సీఎం స్థానంలో అజిత్ ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. తాజాగా ఈ ఫ్రెండ్స్ లండన్‌లో కలిశారు. లండన్ లో సిల్వర్‌స్టోన్ రేసింగ్‌లో అజిత్ కుమార్ కార్ రేసింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే ఈ రేస్‌కు గెస్ట్ గా వెళ్లిన సీఎం విజయ్ గ్రీన్ ఫ్లాగ్ ఊపి అజిత్ పాల్గొన్న కార్ రేస్‌ను ప్రారంభించారు.
ఆతర్వాత అక్కడే ఉన్న అజిత్ దగ్గరకు విజయ్ సరదాగా డాన్స్ చేస్తూ వెళ్లి హగ్ చేసుకున్న వీడియో చూసి ఇరువురి అభిమానులు ముచ్చటపడిపోతుంటే.. నెటిజెన్స్ అయితే వావ్ ఇద్దరు హీరోల క్లోజ్ హగ్ బ్యూటిఫుల్ గా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం విజయ్-అజిత్ హగ్ చేసుకున్న వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
















































