మలయాళంలో హిట్-తెలుగులో ఫట్

Hit in Malayalam-Futt in TeluguHit in Malayalam-Futt in Telugu


మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి.. ఇండస్ట్రీ హిట్ కోసం పరుగులు పెడుతూ.. రూ.250 కోట్లకు పైగా రూ.300 కోట్లకు దగ్గరగా కలెక్షన్స్ కొల్లగొట్టిన బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ చిత్రం తెలుగులోనూ డబ్ అయ్యి గత వారమే విడుదలైంది. మలయాళంలో క్రేజీ హిట్ గా నిలువడమే కాదు.. ఈ చిత్రాన్ని తెలుగులో ఎప్పుడెప్పుడు చూడాలా అని తెలుగు ఆడియన్స్ వెయిట్ చేసేలా సోషల్ మీడియా టాక్ కనిపించింది.

నివిన్ పౌలి, మమిత బైజులు నటించిన ఈ బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ ని తెలుగులో మైత్రి మూవీస్ వారు డబ్ చేసి థియేటర్స్ లో విడుదల చెయ్యగా.. తెలుగులో ఈ చిత్రం థియేటర్స్ లో ఏ మాత్రం ప్రభవం చూపించలేదు. కారణం మలయాళంలో విడుదలైన రెండు వారాలకు ఈ చిత్రం డబ్ అవడం ఒక కారణం.

మలయాళ ఇండస్ట్రీ రూల్స్ ప్రకారం నాలుగు వారాలకే ఓటీటీ విండో లో స్ట్రీమింగ్ వచ్చేసే ఒప్పందం ఉండడంతో తెలుగు ఆడియన్స్ బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ చిత్రాన్ని ఓటీటీ లో చూద్దామని తెలుగు ఆడియన్స్ అనుకోవడం, ప్రమోషన్స్ లేకపోవడం తో బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ తెలుగు లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అని చెప్పాలి. 

Bethlehem Kudumba Unit