డబ్బింగ్ తేలిపోయింది - మరి ఒరిజినల్?
Epic vs Mahendragiri Varahiసెప్టెంబర్ 10 న విడుదలైన తమిళ డబ్బింగ్ చిత్రాలు కార్తీ సర్దార్ 2, సుహాస్, సూరి మందాడి రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు ఎక్కలేదు. ఎన్నో అంచనాలు, మంచి ప్రమోషన్స్ తో విడుదలైన సర్దార్ 2 కి తెలుగు క్రిటిక్స్ డిజాస్టర్ రివ్యూస్ ఇచ్చారు. ప్రేక్షకులు కూడా పెదవి విరిచారు. సర్దార్ 2 కన్నా సర్దార్ 1 బావుంది అన్నారు.
ఇక సూరి, సుహాస్ ల మందాడి చిత్రానికి కూడా యావరేజ్ రివ్యూస్ వచ్చాయి. ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకులు సో సో రెస్పాన్స్ ఇచ్చారు. ఇక ఈరోజు వచ్చిన డబ్బింగ్ చిత్రాలు టాలీవుడ్ లో తేలిపోయాయి. ఈరోజే విడుదలైన తెలుగు స్ట్రయిట్ సినిమా మారెమ్మ చిత్రానికి కూడా డివైడ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.
రవితేజ ఫ్యామిలీ హీరో మారెమ్మ తో ఆకట్టుకోలేకపోయాడు. మరి ఈరోజు సెప్టెంబర్ 10 న విడుదలైన డబ్బింగ్ చిత్రాలు తేలిపోయాయి. రేపు సెప్టెంబర్ 11 న విడుదల కాబోయే ఒరిజినల్ అంటే స్ట్రయిట్ తెలుగు సినిమాలైనా ప్రేక్షకులను ఎంతవరకు ఇంప్రెస్ చేస్తాయో అనే ఆసక్తి మొదలయ్యింది.
రేపు ఆనంద్ దేవరకొండ ఎపిక్, అలాగే అక్కినేని సుమంత్ మహేంద్రగిరి వారాహి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.







































