ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Samantha reveals pregnancy was a surprise

ప్లాన్ చేసుకోని ప్రెగ్నెన్సీ ఇది - సమంత

Samantha reveals pregnancy was a surpriseSamantha reveals pregnancy was a surprise


టాప్ హీరోయిన్ సమంత నాగ చైతన్య ను ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు చేతినిండా సినిమాల్తో బిజీగా వుంది. అప్పట్లో సమంత తల్లి అవడంపై ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. ఆ పెళ్లి నాలుగేళ్లకే పెటాకులయ్యింది. ఇక దర్శకుడు రాజ్ నిడిమోరు ని ప్రేమ వివాహం చేసుకున్న ఏడాది లోపే సమంత ప్రెగ్నెంట్ అయ్యింది.

దానితో రాజ్-సమంత పిల్లల కోసం చాలా త్వరగానే ప్లాన్ చేసుకున్నారు అనుకున్నారు. కానీ సమంత తను ప్రెగ్నెంట్ అవడం అన్ ఎక్స్ పెక్టేడ్ అంటుంది. తను తల్లి అవుదామని ప్లాన్  చేసుకోలేదట. రాజ్ కానీ, తాను కానీ పిల్లలను ప్లాన్ చేసుకోలేదని, కానీ మా ఇంటి బంగారం షూట్ లో తను ప్రెగ్నెంట్ అయ్యాను అని తెలిసి షాక్ అయ్యాను అని చెబుతుంది.

షూటింగ్ సమయంలో కాస్త నీరసంగా ఉండడంతో చెకప్ చేయించుకోగా డాక్టర్ ఆ గుడ్ న్యూస్ చెప్పింది అని, పెళ్ళికి ముందే తను, రాజ్ పిల్లల గురించి చర్చించుకున్నామని, పిల్లలు ఉన్నా, లేకపోయినా పర్లేదు అనుకున్నామని, కానీ ఇలా ప్రెగ్నెంట్ అవడం తనకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంటూ సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

Samantha Ruth Prabhu reveals pregnancy was a surprise