ఇరుముడి దర్శకుడికి NBK ఛాన్స్?

Shiva Nirvana next updateShiva Nirvana next update

 

నందమూరి బాలకృష్ణ కొద్దిరోజులుగా ఊహించని దర్శకులతో కమిట్ అవుతున్నారు. కొరటాల శివ తో బాలయ్య.. ఇది ఎవ్వరూ ఊహించని కాంబినేషన్. ఈమద్యలో దర్శకులు వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల చెప్పిన కథలకు బాలయ్య కనెక్ట్ కావడం, తర్వాత కొరటాల లైన్ లోకి రావడంతో ఆ రెండు ప్రాజెక్ట్ లు వెనక్కి వెళ్లాయి.

తాజాగా ఇరుముడి తో బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ హిట్ కొట్టిన దర్శకుడు శివ నిర్వాణ తో నందమూరి బాలకృష్ణ సినిమా ఉండొచ్చనే ప్రచారం మొదలైంది. ఇరుముడి తో రూ.180 కోట్లు కొల్లగొట్టిన శివ నిర్వాణ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాడు. ఇరుముడి తో మొట్టమొదటిసారి రూ.100 కోట్ల క్లబ్బులోకి వెళ్లిన శివ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్యూరియాసిటీ పెరిగిపోతుంది.

ఆ క్రమంలోనే శివ నిర్వాణ తన తదుపరి మూవీ బాలయ్య తో చేసే అవకాశం ఉంది అంటున్నారు. మరి బాలయ్య-శివ కాంబో అంటే ఆ క్రేజ్ మాములుగా ఉండదు. కానీ శివ అప్పుడే నెక్స్ట్ కథ ప్రిపేర్ చేసుకుని ఏ హీరోని కలుస్తాడో చూడాలి. 

Shiva Nirvana-Balakrishna combo on cards