బాక్సాఫీసు వార్: King vs NBK

Box Office War: Balayya vs NagBox Office War: Balayya vs Nag


కింగ్ నాగార్జున అఫీషియల్ గా తన 100 వ చిత్రాన్ని క్రిస్మస్ అంటే డిసెంబర్ 24 న విడుదల చేస్తున్నట్టుగా కన్ ఫర్మ్ చేసేసారు. డిసెంబర్ లో వచ్చే క్రిస్మస్ హాలిడేస్ ని నాగార్జున టార్గెట్ చేశారు. నాగార్జున బర్త్ డే సందర్భంగా #King 100 మూవీని డిసెంబర్ 24 న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.

ఇక డిసెంబర్ 24 పై మరొకరి కన్ను ఉంది. అదే నందమూరి బాలకృష్ణ కన్ను. ఆయన కూడా గోపీచంద్ మలినేని తో చేస్తున్న NBK 111 చిత్రాన్ని డిసెంబర్ 24 న విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. NBK 111 మేకర్స్ కూడా త్వరలోనే టైటిల్ గ్లింప్స్ తో పాటుగా విడుదల తేదీని ఫిక్స్ చేసి అనౌన్స్ చేయాలనీ చూస్తున్నారు.

ఈలోపే నాగార్జున తన సినిమా డేట్ లాక్ చేసేసారు. NBK111 అలాగే King 100 ఫస్ట్ లుక్స్ లో బాలయ్య అలాగే నాగ్ ఇద్దరూ స్మోక్ చేస్తూ కనిపించారు. ఈ ఏడాది క్రిస్మస్ బాక్సాఫీసు బరి అప్పుడే వేడెక్కేస్తుంది. అందులో సినిమా పరిశ్రమలో కోల్డ్ వార్ కనిపించే నాగార్జున, బాలయ్య మధ్యన బాక్సాఫీసు వార్ అంటే అభిమానులకే కాదు కామన్ ఆడియన్స్ కి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. చూద్దాం బాలయ్య వార్ కి వస్తారో, వెనక్కి తగ్గుతారో అనేది.

Box Office War: NBK111 vs KING100