ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu Launch on September 6

బిగ్ బాస్ 10 లాంచ్ డేట్ ఫిక్స్

Bigg Boss Telugu Launch on September 6Bigg Boss Telugu Launch on September 6


టాలీవుడ్ లో గత కొన్ని సీజన్స్ నుంచి నాగార్జున హోస్ట్ గా ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 10 లాంచ్ డేట్ కూడా వచ్చేసింది. అగ్నిపరీక్ష 2 తో కామన్ మ్యాన్స్ ఎంపిక మొదలు పెట్టిన స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 10 కోసం అన్ని సిద్ధం చేసింది. అన్నపూర్ణ స్టూడియో లోనే బిగ్ బాస్ హౌస్ సెట్ ని అందంగా తీర్చిదిద్దారు.

అగ్నిపరీక్ష 2 లో ఎంపిక చేసిన కంటెస్టెంట్స్ తో పాటుగా మరికొంతమంది సెలెబ్రిటీ కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టే క్షణం ఆసన్నమైంది. కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 6,7 తేదీలలో బిగ్ బాస్ 10 కర్టెన్ రైజర్ ఎపిసోడ్ తో మొదలు పెట్టనున్నట్టుగా ప్రోమో తో అనౌన్స్ చేసారు.

బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో లో 10 రెట్లు సర్ప్రైజ్ లు, 10 రెట్లు డ్రామా ఇంకా 10 రెట్లు ఛాలెంజ్ లు ఉండబోతున్నాయి అంటూ ఈ సీజన్ ఎలా ఉండబోతుందో అనేది రివీల్ చేసారు మేకర్స్. ఈ సీజన్ లోకి వెళ్లబోయే ఆ కంటెస్టెంట్స్ ఎవరో అనేది కూడా సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. 

Bigg Boss Telugu Season 10 to Launch on September 6