వారణాసి విలన్ సినిమా ఇంత చెత్తగానా ?
I Nobody Movie OTT Talk
రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్ ఫిలిం వారణాసి చిత్రంలో కుంభ పాత్రలో విలన్ రోల్ చేస్తున్న క్రేజీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ చిత్రం ఐ నోబడి. ఈ చిత్రం థియేటర్స్ లో తీవ్రంగా నిరాశపరిచింది. వారణాసి విలన్ చిత్రం పరమ చెత్త అంటూ చాలామంది కామెంట్లు పెట్టారు.
హీరో కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కూడా అయిన పృథ్వీ రాజ్ సుకుమారన్ అసలు ఈ చిత్రాన్ని ఎలా, ఎందుకు ఒప్పుకున్నారో అంటూ మాట్లాడారు. ఇప్పుడు ఓటీటీ లో ఐ నోబడి ని వీక్షించిన ప్రేక్షకులు ఈ చిత్రం పై చేస్తున్న కామెంట్స్, సోషల్ మీడియా ట్రోల్స్ మాములుగా లేవు.
సినిమాలో ఎక్కడైనా ట్విస్ట్ ఉంటుందేమో, ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమైనా ఉంటుందేమో అని చివరి వరకు ఎదురు చూడడంతోనే సినిమా ముగిసింది. అసలు భార్యతో గొడవెందుకో క్లారిటీ లేదు, పెద్దమ్మాయి తండ్రితో కనీసం మాట్లాడాడు, అదెందుకో తెలియదు, ఆ డబ్బు వలన సమస్య అని తెలిసినప్పుడు పోలీసులకు ఇచ్చెయ్యొచ్చుగా..
పృథ్వీరాజ్ ని మరీ వీక్ గా చూపించారు, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, మ్యూజిక్, ఇలా ఏది ఆకట్టుకోలేకపోయింది.. ఐ నోబడి ఓ చెత్త సినిమా అంటూ హాట్ స్టార్ లో ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు పెడుతున్న కామెంట్లు ఇవి.







































