సౌత్ లో ఐరెన్ లెగ్ అనిపించుకున్న హీరోయిన్
Actress who was branded as Iron Leg
బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో హిట్ కొట్టిన కియారా అద్వానీ కి అక్కడ హిందీలో ఎలా ఉన్నా ఆమెకు సౌత్ మాత్రం అస్సలు కలిసిరావడం లేదు. సౌత్ లో కియార ఏ సినిమాలో నటించినా, ఏ సౌత్ హీరోతో చేసినా అవి డిజాస్టర్స్ అవుతున్నాయి. గతంలో రామ్ చరణ్ వినయ విధేయరామ తో సౌత్ కి ఎంట్రీ ఇస్తే ఆ సినిమా ఫలితం ఏమిటి అనేది అందరికి తెలుసు.
ఇక మహేష్ తో భరత్ అనే నేను లో నటించింది. అది జస్ట్ యావరేజ్ గా మిగిలింది. ఇక ఆతర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ చేస్తే.. ఆ ఫలితము తేడా కొట్టింది. ఆతర్వాత కియారా అద్బని యశ్ తో టాక్సిక్ లో నటించింది. యశ్ తో కలిస్ మితి మీరిన రొమాన్స్ చేసింది. సినిమా విడుదలకు ముందే కియారా అందరికి ఎక్స్ ప్లనేషన్ ఇవ్వాల్సి వచ్చింది.
ఇక సినిమా విడుదలయ్యాక టాక్సిక్ పై సోషల్ మీడియాలో కనిపిస్తున్న విమర్శలు, ట్రోల్స్ అన్ని చూసి కియారా అద్వానీ కి సౌత్ కలిసి రాలేదు, కాదు కాదు కియారా అద్వానీ సౌత్ లో ఐరెన్ లెగ్ హీరోయిన్ గా మారింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అమ్మడు సౌత్ లో నటించిన సినిమాలన్నీ అవుట్ అంటూ కియారా ను ఆడుకుంటున్నారు.
















































