ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ravi Teja Should Maintain The Same Pace

రవితేజ ఇదే ఫ్లో మైంటైన్ చేస్తే..!

Ravi Teja Should Maintain The Same PaceRavi Teja Should Maintain The Same Pace

 


మాస్ మహారాజ్ రవితేజ లైన్ లో పడ్డారు. ఈ ఏడాది భర్త మహాశయులకు విజ్ఞప్తి తో ఓకే అనిపించిన రవితేజ ఎనిమిది నెలలు తిరిగేసరికి ఇరుముడి తో బిగ్ కమ్ బ్యాక్ ఇచ్చ్చారు. ఇరుముడి తో రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. బీసీ సెంటర్స్ లో ఇరుముడి థియేటర్స్ హౌస్ ఫుల్ తో నడుస్తున్నాయి.

రవితేజ ఇకపై దర్శకులపై, కథలపై ప్రత్యేక దృష్టి పెడితే ఇదే ఫ్లో మైంటైన్ చేస్తే విజయాలు ఆయనకు దరి చేరతాయి. సినిమాలు మీద సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపే రవితేజ ఆచి తూచి సినిమా ఒప్పుకోవాలి. ఎన్ని సినిమాలు చేశామనేది కాదు లెక్క.. అందులో ఎన్ని విజయాన్ని ద్కకించుకున్నాయి అనేదే లెక్క.

రవితేజ ఇకపై సినిమా విడుదల కాగానే మరో సినిమా పట్టాలెక్కించెయ్యకుండా అన్ని చూసుకుని  వెళ్ళాలి, అలాగే ప్రమోషన్స్ లోను రవితేజ హడావిడి చేస్తే  ఎలా ఉంటుందో ఇరుముడి ఓపెనింగ్స్ నిరూపించాయి. ఇకపై రవితేజ ఇదే ఫ్లో మైంటైన్ చెయ్యాలని అభిమానుల కోరిక.

Ravi Teja Is On Right Track