గ్యాంగ్‌స్టర్‌ని అంటూ స్టార్ హీరోని బెదిరించాడు
Salman Khan Extortion Plot Revealed As Fakeబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని సాగిన ఒక నకిలీ దోపిడీ -ఎక్స్ టార్షణ్ కుట్రను ముంబై పోలీసులు చేధించారు. సల్మాన్‌ను భయపెట్టి డబ్బులు గుంజాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి గ్యాంగ్‌స్టర్ల పేరుతో నకిలీ వాట్సాప్ చాట్‌లు, ఫేక్ ఐడెంటిటీలు సృష్టించి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
అయితే అతడు అందించిన వివరాల్లోని వాట్సాప్ చాట్‌లు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు సరిపోలకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. సల్మాన్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేయడానికే ఈ స్టోరీ అంతా తానే అల్లినట్లు నిందితుడు అంగీకరించాడు.
ఈ కేసుకు సంబంధించి బాంద్రా తీరప్రాంతం వద్ద దాచిపెట్టిన రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బీహార్‌లోని సివాన్ నుండి ఫోన్ పే ద్వారా దాదాపు రూ. 1.30 లక్షలు పొంది.. వాటిని బాంద్రాలోని ఒక మనీ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ ద్వారా నగదు రూపంలో తీసుకున్నట్లు విచారణలో తేలింది. దీనిపై నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత బీఎన్ ఎస్- ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కుట్రలో అతనొక్కడే ఉన్నాడా లేక ఇంకా ఎవరైనా భాగస్వాములు ఉన్నారా అనే కోణంలో ముంబై పోలీసులు విచారణ వేగవంతం చేశారు.







































