ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Balakrishna's NBK 111: Dada Title Creates Buzz

NBK 111 టైటిల్ విషయంలో క్రేజీ న్యూస్

Balakrishna's NBK 111: Dada Title Creates BuzzBalakrishna's NBK 111: Dada Title Creates Buzz


నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కలయికలో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న NBK 111 చిత్రం పై బాలయ్య బర్త్ డే కి వదిలిన టీజర్ తో విపరీతమైన అంచనాలు పెరిగాయి. శరవేగంగా సాగుతున్న షూటింగ్ కి బాలయ్యకు జరిగిన ప్రమాదంతో ప్రస్తుతం NBK 111 షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి.

ఈ చిత్రాన్ని డిసెంబర్ 24 న క్రిస్మస్ స్పెషల్ గా విడుదల చెయ్యాలని మేకర్స్ డిసైడ్ అవుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ కోసం రెండు టైటిల్స్ ని గోపీచంద్ మలినేని పరిశీలిస్తున్నారట. అందులో ఒకటి గాడ్, ఇక రెండోది దాదా అనే రెండు టైటిల్స్ NBK 111 కోసం పరిశీలిస్తున్నట్టుగా, బాలయ్య ఈ రెండిటిలో ఏది ఫైనల్ చేస్తారో అపుడు అది అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.

ఈ చిత్రంలో సంజయ్ దత్ అలాగే మంచు మనోజ్ విలన్స్ గా కనిపిస్తుండగా.. బాలయ్య మాసివ్ లుక్ లో అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతున్నారు. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. వచ్చే నెల నుంచి బాలయ్య NBK 111 షూట్ లో పాల్గొంటారని తెలుస్తుంది. 

Balakrishna's NBK 111