DC రూ.100 కోట్ల బొమ్మ
DC Surpasses 100 Crore Milestone
కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన DC చిత్రం రూ.100 కోట్ల క్లబ్బులకి చేరుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలకు ముందు ఎలాంటి హైప్, ఎలాంటి క్రేజ్ లేని ఈ చిత్రం విడుదలయ్యాక బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులోనూ DC హిట్టు బొమ్మగా నిలిచింది.
DC విడుదలైన రెండు వారాలకు గాను లోకేష్ కనగరాజ్ DC చిత్రం అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం అఫీషియల్ గా రూ.100 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అయినట్టుగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసారు. హీరోగా డెబ్యూ మూవీ తోనే లోకేష్ కనగరాజ్ రూ.100 కోట్ల మైల్డ్ స్టోన్ ని అందుకున్నారు.
ప్రమోషన్స్ లేకుండా, ఆడియన్స్ లో కేవలం మౌత్ టాక్ తోనే DC చిత్రం రూ.100 కోట్లు కొల్లగొట్టడం నిజంగా ఆశ్చర్యకర విషయమే. అదే పక్కా ప్రమోషన్స్ తో DC విడుదలైనట్టయితే ఇంకాస్త బెటర్ కలెక్షన్స్ వచ్చేవి. కనీసం విడుదలై హిట్ టాక్ పడ్డాక అయినా ప్రమోట్ చేసి ఉంటె ఈ హిట్టు వేరే లెవల్లో ఉండేది.








































