మెగా 158 - సంక్రాంతి కే ఫిక్స్

Mega158 targets Sankranthi 2027Mega158 targets Sankranthi 2027

 

ప్రతి రోజు ప్రతి నిమిషం 2027 సంక్రాంతి బరి మరీ హాట్ గా మారిపోతుంది. సంక్రాంతి 2027 లో చాలా సినిమాలు లైన్ లోకి రావడమే కాదు బల్ల గుద్ది మరీ సంక్రాంతి రేస్ లోకి వస్తున్నాయి. ఇప్పటికే శర్వానంద్-శ్రీను వైట్ల జార్జ్ క్రిష్, అనిల్ రావిపూడి-వెంకీ-కళ్యాణ్ రామ్ ల మూవీ, ఆతర్వాత ప్రశాంత్ వర్మ మహంకాళి, అలాగే రవితేజ-శ్రీవిష్ణు చిత్రాలు 2027 సంక్రాంతి ని లాక్ చేసేశాయి.

ఇప్పుడు మెగా 158 చిత్రం కూడా సంక్రాంతి బాక్సాఫీసు బరి లోకి రావడం పక్కా. చిరంజీవి - బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న మెగా 158 చిత్ర షూటింగ్ చాలా వరకు ఫినిష్ అవడమే కాదు ఫస్ట్ హాఫ్ కూడా లాక్ చేసేసినట్లుగా తెలుస్తుంది. మిగతా షూటింగ్ కూడా కంప్లీట్ చేసి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చెయ్యాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.

ఇక ఆగష్టు 22 న చిరు బర్త్ డే కి మెగా 158 టైటిల్ రాబోతుంది. చిరు-బాబీ మూవీకి కాక అనే టైటిల్ ని లాక్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ టైటిల్ గ్లింప్స్ ని మేకర్స్ చిరు బర్త్ డే స్పెషల్ గా కొన్ని స్పెసిక్ థియేటర్స్ లో రివీల్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. 

Mega158: Sankranthi Release Confirmed!