రష్మిక కామెంట్స్ పై యశ్ రియాక్షన్
Yash breaks silence on Rashmika Mandanna’s Mr showoff remark
కన్నడ నుంచి వచ్చి పాన్ ఇండియాలోని పలు భాషల్లో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న రష్మిక మందన్న కన్నడ స్టార్స్ పై గతంలో ఎప్పుడు ఏదో ఒక కామెంట్స్ చేసి కాంట్రవర్సీలో ఇరుక్కుని కన్నడ ప్రేక్షకుల ఆగ్రహానికి గురవుతుంది. అలాంటి సందర్భంలో కెజిఎఫ్ స్టార్ యశ్ ని ఓ ఇంటర్వ్యూలో మిస్టర్ షో ఆఫ్ అంటూ చేసిన కామెంట్స్ పై అప్పట్లో యశ్ అభిమానులు భగ్గుమన్నారు. దానితో ఆమె క్షమాపణ కూడా చెప్పాల్సి వచ్చింది.
తాజాగా యశ్ టాక్సిక్ ప్రమోషన్స్ లో రష్మిక మిస్టర్ షో ఆఫ్ కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు. రష్మిక నన్ను ఏ ఉద్దేశ్యంలో అన్నారో తెలియదు కానీ.. ఆమె అప్పటికి ఇండస్ట్రీకి కొత్త. కొన్ని టీవీ షోలలో యాంకర్స్ రెండుమూరు ఆప్షన్లు ఇచ్చి ఏదో ఒకటి ఎంచుకోమంటారు. అలా ఇచ్చిన ఆప్షన్లలో నాకు ఇది సరిపోతుందని రష్మిక భావించి ఉండొచ్చు.
నేను మాత్రం రష్మిక వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోలేదు. ఒకరి అభిప్రాయం నా వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ నిర్ణయించలేదు. వేరే వాళ్ళు ఏదో అనుకుంటారని, వారి కోసం నా క్యారెక్టర్ మారదు అని చెప్పిన యశ్.. తన అభిమానులకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. నా తోటి నటీనటులను గౌరవించని వారు నా అభిమానులు కారు అంటూ అభిమానులకు చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చారు.







































